ఆర్మూర్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు గజ్వేల్ లో కెజి టు పిజి గ్రౌండ్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలో పాల్గొంటారన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణ చందర్ రావు, వైస్ ప్రిన్సిపల్ సాయన్న, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి మరికంటి గంగా మోహన్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్, పిఈటి రాజేందర్, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ ఈ నరేష్ పాల్గొన్నారు.