నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థిక అక్షరాస్యత కింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలాన్నారు. ప్రధానంగా పొదుపు పై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయాలని, అవగాహన ర్యాలీలు, వినియోగదారులతో ఆర్థిక అక్షరాస్యత సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పి సీ.ఈ.ఓ సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్, మెప్మా పీ.డీ రాజేందర్, అభిజిత్ తదితరులు పాల్గొన్నారు.