పెంచిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఫీజును తగ్గించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్‌సోర్సింగ్‌ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని టీపీసీసీ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కు సోమవారం మెయిల్‌ ద్వారా, ‘ఎక్స్‌’ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇందులో సగానికి పైగా సొమ్ము యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఓమాన్‌, ఖతార్‌, బహరేన్‌ ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాల నుంచే వచ్చింది. ప్రవాసి కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లుగా నిలుస్తున్నారు. గల్ఫ్‌ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఏటా 26.6 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది. విదేశాల నుంచి ఫారెక్స్‌ పంపిస్తున్న తమ ప్రవాసీలకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం 2.5 శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. మనకంటే చాలా చిన్న దేశం బాంగ్లాదేశ్‌ తమ ప్రవాసులకు ప్రోత్సాహాకాలు ఇస్తుంటే భారత్‌ మాత్రం ఎన్నారైలను పీడిస్తున్నదని భీంరెడ్డి అన్నారు.

ఇప్పటికే తక్కువ వేతనాలు, జీతం దొంగతనం (వేజ్‌ థెఫ్ట్‌), రుణ బానిసత్వం, బలవంతపు శ్రమ, పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవల ఫీజుల పెంపు మరింత అన్యాయం చేస్తుంది. ప్రవాసి కార్మికులు తమ ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసినందుకు వారికి భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మంద భీంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవాసి కార్మికులకు సహాయం చేయడానికి బదులుగా, వారిని ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలకు ఆదాయ వనరులుగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.

గల్ఫ్‌ దేశాలలో ఇండియన్‌ పాస్‌ పోర్ట్‌, కాన్సులర్‌ సేవల ఫీజు పెంపు ఈ విధంగా ఉన్నది. సౌదీ అరేబియా లో 200-300 రియాళ్లు (గతంలో 50-75), యూఏఈ లో 200-350 దిర్హములు (గతంలో 50-100), ఓమాన్‌ లో 25-35 రియాళ్లు (గతంలో 5-10), బహరేన్‌ లో 20-30 దీనార్లు (గతంలో 5-10), ఖతార్‌ లో 150-200 రియాళ్లు, కువైట్‌ లో 23.750 దీనార్లు వసూలు చేస్తున్నారు.

గల్ఫ్‌ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, వలస కార్మికుల హక్కుల సంఘాలను, పౌర సమాజ సంస్థలను, వలస కార్మికులను ఎందుకు సంప్రదించలేదు. పారదర్శకత, వాటాదారుల ప్రమేయం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భీంరెడ్డి డిమాండ్‌ చేశారు.

Check Also

కొత్త డైట్‌ మెనూ అమలు పరచాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామరెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »