కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా త్రాగునీరు, షామియానాలు ఏర్పాటుచేయాలని తెలిపారు.
జిల్లాలోని మూడు డివిజన్ లో నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సీటింగ్ ఏర్పాట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ చేయనున్న సిబ్బందికి భోజన వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న సామాగ్రినీ, బ్యాలెట్ బాక్స్‌లను కలెక్టర్ పరిశీలించారు. బుధవారం నాడు మెటీరియల్ పంపిణీ చేయనున్న వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ అనీల్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో జరుగనున్న ఏం.ఎల్.సి. పట్టభద్రుల నియోజక వర్గానికి 29 పోలింగ్ కేంద్రాలలో 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 పురుషులు, 4793 మంది స్త్రీలు, ఒక థర్డ్ జెండర్, ఉపాధ్యాయ నియోజక వర్గంలో 25 పోలింగ్ కేంద్రాల్లో 2011 మంది ఓటర్లు కాగా, ఇందులో 1307 మంది పురుషులు, 704 మంది స్త్రీలు తమ ఓటు హక్కు వినియోగించూకో నున్నారని కలెక్టర్ తెలిపారు.
శాసన మండలి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రిసైడిరగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రిసైడిరగ్ అధికారులు, 116 మంది ఒ.పి.ఒ. లను నియమించడం జరిగిందని తెలిపారు.