జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 21న జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్, సుద్ధపల్లి క్రీడా మైదానాలలో జరిగిన జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు బాలికల విభాగంలో ఆర్.గంగోత్రి, బి. మైత్రి, జీ.వనజ, జి. సరిత.
బాలుర విభాగంలో డి.మురళి, బి.విష్ణు చైతన్య, సిహెచ్.సుశాంత్ మరియు ఎం.శివ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ప్రబబుల్స్ జట్టుకు ఎంపికై జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్, సుద్ధపల్లి లలో ఈనెల 22 నుండి 25 వరకు జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని తుది జట్టుకు ఎంపికై ఈనెల 28 నుండి 02 వరకు కేజీ టు పీజీ గ్రౌండ్ గజ్వేల్, సిద్దిపేట్ జిల్లాలో జరగనున్న రాష్ట్ర బేస్ బాల్ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వల్ల దృఢత్వంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరి ఉదయం సాయంత్రం క్రీడలలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపి జాతీయ పోటీలకు ఎంపిక కావాలన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, డాక్టర్ నరసింహారావు, సునీత, కృష్ణ, మాలతి, పల్లె గంగాధర్, గౌతమి మరియు ఓఎస్ శేఖర్ లు పాల్గొన్నారు.