కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. తొలుత కలెక్టర్ కు ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పదవతరగతి విద్యార్థులను మాథ్స్‌లో లెక్కలను బోర్డు పై చేయించి సంతృప్తి చెందారు. హార్డ్ వర్క్ చేయాలని, ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించాలని అన్నారు.
అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి లక్ష్యాన్ని ఎంచుకోవాలని, కష్టపడి ఇష్టపడి చదవాలని అన్నారు. భవిష్యత్తులో ఏమవుతారని ఇంటర్ బైపిసి విద్యార్థులను అడిగారు. కార్డియాలజీ, న్యూరోలాజి, డర్మ్రిటాలోజి, వంటి వైద్య వృత్తి చేపడతామని విద్యార్థులు తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు కంప్యూటర్ వంటి వృత్తిలో ఎదగాలని తెలిపారు.

విద్యార్థులు చిరు ప్రాయం నుండే కష్టపడే తత్వం ఉండాలని తెలిపారు. ఐఐటి, జేఈఈ లకు ప్రిపేర్ కావాలని, అవసరమైన మెటీరియల్ సమకూర్చుతామని తెలిపారు. అనంతరం పలు తరగతుల విద్యార్థులతో కలిశారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని రజిత, తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ రఘు, తదితరులు పాల్గొన్నారు.