కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పదవ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో 54 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష హాలులోకి విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రంలోకి పంపించాలని తెలిపారు. పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించడం జరుగదని తెలిపారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీసు స్టేషన్ నుండి సరఫరా చేయడం జరుగుతుందని, కేంద్రాల్లో సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటు చేసిన సి సి టివి ముందు ప్రశ్న పత్రాలను ఓపెన్ చేయాలనీ తెలిపారు.
పరీక్షల నిర్వహణ అనంతరం ఏరోజుకారోజు జవాబు పత్రాలను పోస్టాఫీసుకు పంపించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, పరీక్షల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.