కామారెడ్డి, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని కామారెడ్డి బిజెపి పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు.
ఈనెల ఫిబ్రవరి 2 తేది ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని, రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.
మసీదుల వద్ద భద్రత ఉంచాలని ఏఎస్పి చైతన్ రెడ్డికి వినతి పత్రం అందజేశామన్నారు. ఇద్దరు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, 22 వ వార్డు ఇన్చార్జి మహమ్మద్ మేరాజ్, సయ్యద్ ముజఫర్, షకీలొద్దీన్ పాల్గొన్నారు.