జక్రాన్‌పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్కాన్ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను బోధిస్తూ విద్యార్థులకు ప్రిపరేటరీ పరీక్షలను నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది, కావున విద్యార్థులందరూ పరీక్షల పట్ల భయాందోళనలు వీడి పరీక్షలకు చక్కగా సన్నద్ధమై మంచి ఉన్నతమైన ఫలితాలను సాధించాలని సూచించారు.
ఈ సంవత్సరము, ఇంటర్మీడియట్లో కష్టపడ్డట్లయితే మంచి కాలేజీలలో సీట్లు సంపాదించి మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమానికి స్థానిక జక్రాన్‌పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస్, పడకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 480 మంది పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మోటివేటర్ స్పీకర్‌గా మహేష్ పాల్గొని విద్యార్థుల యొక్క భయాందోళన తొలగించి పరీక్షలకు సన్నద్ధం చేశారు. వివిధ పాఠశాలల నుండి విషయం నిపుణులుగా వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఆ విషయాలలో చక్కటి సూచనలు ఇచ్చి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. విషయ నిపుణులుగా కాసర్ల నరేష్, రాజు నారాయణ, అరవింద్, గోపాలకృష్ణ, ముద్దుకృష్ణ, స్రవంతి, రవీందర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు అందజేశారు.