డిచ్పల్లి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య రక్ష నేచర్ క్యూర్ యోగా సెంటర్ యోగా తెరపిస్ట్ ఐశ్వర్య విశ్వవిద్యాలయంలో అధ్యాపకులకు విద్యార్థినిలకు యోగాసనాల పట్ల అవగాహన కల్పించి ఆసనాలు వేయించినారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక మాట్లాడుతూ ఈ ఒత్తిడి సమాజంలో మానసిక ప్రశాంతతకు యోగాసనాలు ఔషధంలాగ పనిచేస్తున్నాయని క్రమం తప్పకుండ యోగాసనాలు అభ్యసనం చేయాలన్నారు.