జక్రాన్పల్లి, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బిజెపి అభ్యర్థులైన టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమలై అంజి రెడ్డి ఉమ్మడి మెదక్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్నెపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించి బిజెపి అభ్యర్థులకు పట్టం కట్టడం కాంగ్రెస్ అసమర్థ, అబద్ధపు పాలనకు నిదర్శనం అని, గెలిచిన ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ చేతగాని కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించడం చాలా సంతోషకరం అని ఇకపై భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత బలంగా పని చేసి అన్ని గ్రామాల్లో బిజెపి అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు.
స్థానిక బిజెపి నాయకులు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జక్కం కార్తీక్, రాజారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డార్లింగ్ సంతోష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.