కామారెడ్డి, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నేటి నుండి ప్రారంభం అయి ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని 38 కేంద్రాలలో 7949 మంది విద్యార్థులకు గాను 7789 మంది విద్యార్థులు హాజరు కాగా, 160 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. ఇందులో 7278 మంది విద్యార్థులు జనరల్ అభ్యర్థులకు గాను 7137 మంది హాజరు అయ్యారని, 141 మంది గైర్ హాజరు అయ్యారని, వొకేషనల్ కోర్సులో 671 మందికి గాను 652 మంది హాజరు కాగా 19 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని తెలిపారు.