కామారెడ్డి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్ లలో పరీక్ష ప్రశాంతంగా జరిగాయి.
శుక్రవారం జరిగిన పరీక్షలో 9337 మంది విద్యార్థులకు గాను 8953 మంది విద్యార్థులు హాజరయ్యారని, 384 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఇందులో జనరల్ గ్రూప్ లో 7347 మందికి గాను 7116 మంది హాజరుంకాగా, 231 మంది గైర్ హాజరు అయ్యారని తెలిపారు. వొకేషనల్ గ్రూప్ లో 1990 మంది విద్యార్థులకు గాను 1837 మంది హాజరు కాగా, 153 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్‌కి ఆస్కారం ఇవ్వకూడదని తెలిపారు.