నిజామాబాద్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాబోయే విద్యా సంవత్సరానికి స్కూల్ యూనిఫాం కుట్టడానికి మహిళలు అందరూ సిద్ధంగా ఉండాలని,అందుకై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్‌డివో సాయాగౌడ్ చెప్పారు.
రెండు రోజులుగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మహిళా టైలర్లకు మార్గనిర్దేశం చేశారు. పోయినా సంవత్సరం మహిళలు విజయవంతంగా యూనిఫాం కుట్టించి సకాలంలో స్కూల్కు పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సంవత్సరంలో కూడా అన్ని స్కూల్ విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారానే కుట్టించడం జరుగుతుందని,అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు..
శిక్షణ కార్యక్రమాల్లో అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ డీపీఎం సాయిలు,సంధ్యారాణి, ఏపిఎం రాజేందర్ రిసోర్స్ పర్సన్ మాధవి, పద్మ, సుజాత, మంజుల, మాధవి అన్ని మండలాల మహిళా టైలర్‌లు పాల్గొన్నారు.