సదాశివనగర్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సదాశివనగర్ మండలంలోని జిల్లాపరిషత్ హైస్కూల్ (జడ్పిహెచ్‌ఎస్) కల్వారాల్ 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుక, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పూర్వ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి అనుభవాలు పంచుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన కొత్త కంప్యూటర్ రూమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, మౌలిక సదుపాయాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్కూల్ అభివృద్ధికి అవసరమైన అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.