బాన్సువాడ, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ ఉద్యోగులు, ఓంశాంతి సభ్యులను, డిపో మేనేజర్ సరితా దేవిని బిజెపి నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని, కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళల కొరకు 33 శాతం రిజర్వేషన్ను కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళల భాగ్యసామ్యం మరింత పెరిగి, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా మారుతుందన్నారు.
కార్యక్రమంలో డిపో మేనేజర్ సరిత దేవి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు తుప్తి ప్రసాద్ బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి కొనాల గంగారెడ్డి, చీకట్ల రాజు, చిరంజీవి, వెంకట్ శంకర్ రామకృష్ణ, సాయి రెడ్డి, కార్యకర్తలు, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.