జక్రాన్‌పల్లి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తోర్లికొండ గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మి అనే మహిళా ఈనెల 7న ఇంటికి తాళం వేసి ఆర్మూర్‌లోని కూతురు దగ్గరకి వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి, బీరువాలో వున్న బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు.
ఈ విషయమై 8వ తేదీ ఫిర్యాదు చేయగా డిచ్పల్లి సిఐ మల్లేష్ ఆద్వర్యంలో ఎస్ఐ తిరుపతి జక్రాన్‌పల్లి వారి సిబ్బంది, చాకచక్యంగా వ్యవహరించి అదే గ్రామానికి చెందిన నూనె కిరణ్ అనే పాత నేరస్తుడుని పట్టుకుని విచారించారు. కాగా అతని వద్ద నుండి బంగారు ఆభరణాలు, ఒక ఐరన్ బాక్స్ స్వాదీన పరుచుకున్నట్టు తెలిపారు.