కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని 38 కేంద్రాలలో 8072 మంది విద్యార్థులకు గాను 7921 మంది విద్యార్థులు హాజరు కాగా, 151 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. ఇందులో 6792 మంది విద్యార్థులు జనరల్ అభ్యర్థులకు గాను 6683 మంది హాజరు అయ్యారని, 109 మంది గైర్ హాజరు అయ్యారని, వొకేషనల్ కోర్సులో 1280 మందికి గాను 1238 మంది హాజరు కాగా 42 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని తెలిపారు.