బాన్సువాడ, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో కోటగిరి, వర్ని, చందూర్ మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో తహసిల్దార్లు గంగాధర్,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ,వైస్ చైర్మన్ అనిల్, సాయిరెడ్డి, నాయకులు రేంజర్ల సాయిలు, శనిగరం కిషన్, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.