బాన్సువాడ, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఈ గంగాధర్ అన్నారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ గంగాధర్ మాట్లాడుతూ పొలం బాట కార్యక్రమంలో భాగంగా పంట పొలాల్లో వంగిన ,విరిగిన, నేలకోరిగిన విద్యుత్ స్తంభాలను గుర్తించి విద్యుత్ తీగలను సరిచేస్తామన్నారు.
నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు అనునిత్యం కృషి చేస్తామని రైతులు విద్యుత్ అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ప్రభాకర్,, ఏఈ అనిల్ కుమార్, లైన్మెన్, విద్యుత్ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.