రేపు ఇందూరులో గొప్ప కార్యక్రమం

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

1925 లో ఒక చిన్న పిల్లల ఆటల గుంపుగా ప్రారంభమై ఈరోజు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తన యొక్క శాఖలను విస్తరించి అతిపెద్ద సామాజిక సంస్థగా అవతరించిన అసామాన్యమైన వ్యవస్థ.

100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా ఇందూరు నగరంలో సుదీర్ఘకాల ప్రయత్నాల కారణంగా నగరంలోని 50 బస్తీల్లో 56 శాఖలను ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక సంపూర్ణ నగరంగా అవతరించిన శుభ సందర్భంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న 56 శాఖలను ఒకే చోట ఒకే సమయంలో కలిపి శాఖల సంగమాన్ని నిర్వహించాలని ఇందూరు నగర శాఖ నిర్ణయించింది.

ఆలోచనలో భాగంగా మార్చి 16 ఆదివారం రోజున ఉదయం 7 గంటలకు నగరంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నగర శాఖల సంగమ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా అర్గుల సత్యం మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనదని రానున్న హిందూ శతాబ్దానికి ఇది నాంది పలుకుతుందని ప్రపంచమంతా హిందుత్వ జాగరణ జరుగుతున్న శుభ తరుణంలో ప్రతి హిందువు తల ఎత్తుకొని తాను హిందువునని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు.

నాగపూర్‌లో ప్రారంభమైన కొద్దినాల్లకే మన ఇందూరు నగరంలో కూడా గాజులపేటలోని దత్త మందిరంలో మొట్టమొదటి శాఖ ప్రారంభమైందని ఒక్క శాఖగా ఆనాడు ప్రారంభమైన సంఘ గంగా ప్రవాహము నిరంతరాయంగా,నిర్విరామంగా శాఖోప శాఖలుగా విస్తరించి ఈరోజు 50 బస్తీల్లో 56 శాఖల సువిశాల రూపంగా అవతరించిందని, శ్రీకృష్ణుడికి అత్యంత భక్తితో నివేదించే 56 రకాల నైవేద్యాలను చెప్పను అని పిలుస్తామని అదే పద్ధతిలో ఇందూరు హిందూ సమాజము భారత మాతకు 56 శాఖల రూపంలో ఒక అపురూపమైన నైవేద్యం సమర్పిస్తున్నదని ఇలాంటి అపురూప దృశ్యాన్ని చూడటం కోసము, ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా కోసము సమస్త హిందూ సమాజాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొనటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫామ్‌ అక్కర్లేదని, ఎవరైనా స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొనవచ్చని కేవలం గంట పాటు జరిగే కార్యక్రమం ద్వారా ఇందూరు హిందూ సమాజానికి సంఘటన శక్తి యొక్క విరాట్‌ స్వరూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

56 శాఖలు అంటే కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క బృందాలు కావని మన నగరంలోని 56 బస్తీల హిందూ సమాజానికి ప్రతినిధులని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్‌ అమర లింగన్న తమ సందేశాన్ని అందజేస్తారని పిల్లలు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా ఇందూరు హిందువులందరూ కార్యక్రమంలో భాగం కావాలని సూచించారు.

Check Also

తొర్లికొండ పాఠశాలలో నిర్మాణాలకు భూమిపూజ

Print 🖨 PDF 📄 eBook 📱 జక్రాన్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »