జక్రాన్‌పల్లి, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో ఆర్మూర్ రోటరీ ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్మూర్ రోటరీ అధ్యక్షులు రాజనీష్ కిరాడ్ టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్ బ్లాక్ ప్రాజెక్టు ఖర్చు విలువ సుమారు 10 నుండి 12 లక్షల వరకు అవుతుందని, 80 శాతం ఆర్ సి లేక మోయినాబాద్ సిఎస్ఆర్ ఫండ్స్ రోటరీ ఆధ్వర్యంలో మరియు 20 శాతం లింగన్న గారి మంజిత్ రెడ్డి, బ్రదర్స్ ఎం వెంకటరాం రెడ్డి (భాయ్ సాబ్) జ్ఞాపకార్థం నిధులు అందజేస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్థం యొక్క టాయిలెట్ బ్లాక్ నిర్మిస్తున్నామన్నారు,
కార్యక్రమంలో రోటరీ ఫాస్ట్ గవర్నర్ ఎన్ వి హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాస ఆనంద్, ప్రాజెక్ట్ చైర్మన్ కాంతి గంగారెడ్డి, పుష్పాకర్ రావు, పాస్ట్ ప్రెసిడెంట్ విజయసారథి, ప్రవీణ్ పవర్, లక్ష్మీనారాయణ, ఖందేష్ సత్యం, బ్రాహ్మణపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తొర్లికొండ వాస్తవ్యులు బొజ్జ మల్లేష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు స్వామి, గ్రామ నాయకులు వినోద్, సంజీవ్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.