నిజామాబాద్, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇతిహాస సంకలన సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ పథ పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ చరిత్ర పరిశోధకులు యొక్క జాతీయ స్థాయి సెమినార్ లో ఇందూరు చరిత్ర పరిశోధకులు కందకుర్తి ఆనంద్ దావుల వివేకానంద పాల్గొన్నారు.
ఇందూరు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి కందకుర్తి ఆనంద్, ఇందూరు జిల్లా దేవాలయాల చరిత్ర గురించి దావుల వివేకానంద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జాతీయ స్థాయి సెమినార్లో సమర్పించారు.
దక్షిణ భారతదేశ చరిత్ర ఎంతో వైభవమైందని ప్రపంచం విస్తుపోయే ఎన్నో అద్భుతాలకు దక్షిణ భారతదేశ చరిత్ర ఆధారమైందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నట్టు జిల్లా బృందం సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా బృందం సభ్యులు ఇతిహాస సంకలన సమితి జాతీయ సంఘటన కార్యదర్శి బాలముకుందు పాండే మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రావు చేత ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మరియు విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం అరవింద్ రావు మరియు పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహారావు తదితర ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాఖ అధికారులు ప్రొఫెసర్లు పాల్గొన్నట్లు తెలిపారు.
మూడు రోజులపాటు జరగనున్న జాతీయ స్థాయి సెమినార్‌లో దక్షిణ భారతదేశ చరిత్ర గురించి 120 మంది చరిత్ర పరిశోధకులు తమ యొక్క పరిశోధనా వ్యాసాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.