నందిపేట్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు.
నందిపేట్ తెలుగు మీడియం నుంచి 200 ఉర్దూ మీడియం నుంచి 109, జిల్లా పరిషత్ హైస్కూల్ అయిలాపూర్ నుంచి 113, భాద్గుణ 34, వెల్మల్ 70 కుదవన్ పూర్ 62, డొంకేశ్వర్ 160, నూత్ పల్లి పాఠశాల నుంచి 84 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఎం ఈ ఓ గంగాధర్ తెలిపారు.