బాన్సువాడ, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామపంచాయతీలో సోమవారం ఎన్జీవో సాధన ఆర్గనైజేషన్ గీత గ్రామంలో జరిగిన వివాహాల రికార్డు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, బాలికలపై అగత్యాలకు పాల్పడుతూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.
కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ షాబుద్దీన్, సిబ్బంది చాంద్ తదితరులు పాల్గొన్నారు.