డిచ్‌పల్లి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో మంగళవారం నుండి ఎల్.ఎల్.బి.,ఎల్ ఎల్ ఎం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి. ఈ పరీక్షలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తనిఖీల్లో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న రాణి. అడిషనల్ కంట్రోలర్ డా. టి. సంపత్ పాల్గొన్నారు
పరీక్షలకు 42 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. (09) మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ గారు తెలిపారు.