ఆర్మూర్, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్షత్రియ స్కూల్ చేపూర్ నందు (స్పోర్ట్ మీట్) క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కుడా ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పాడు తాయని అన్నారు. క్రీడా ప్రతిభకు పేదరకం అడ్డురాదని ప్రతిభ ఉంటే ప్రపంచస్థాయిలో రాణించవచ్చనని ఇందుకు మంచి ఉదాహరణ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అని దేవేందర్ అన్నారు.
డైరక్టర్ అల్జాపూర్ వీరేందర్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మధ్య స్నేహన్ని పెంపొదిస్తాయని, ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ఒటమి పట్ల నిరాశ చెందకుండా మరో విజయానికి ముందడుగు వేయాలని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పండుగ బుధవారంతో ముగుస్తాయి. కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరిక్షిత్, వ్యాయమ ఉపాధ్యాయులు సాయినాథ్, సాయిలు, సారిక,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.