కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం తో పాటు అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందాలని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద కాంట్రాక్టు పద్ధతిన 26 మందికి , వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ గా ఒకరికి నియామకం పత్రాలు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య డా. చంద్రశేఖర్, సబ్ యూనిట్ ఆఫీసర్ చలపతి లు పాల్గొన్నారు.