డిచ్‌పల్లి, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్ జనరల్ మేనేజర్ బీజయ కుమార్ సాహు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అంబులెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందుకు ఎస్‌బిఐ ఉన్నతాధికారులకు తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.