నిజామాబాద్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మండలం పెర్కిట్ లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉర్దూ మీడియం స్కూల్‌లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ ను సందర్శించి క్లాసులను పరిశీలించారు.
విద్యార్థినుల విద్యావిషయక సామర్థ్యాన్ని పరీక్షించారు. జ్యోతిబాపూలే పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూంలను సందర్శించి, బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన వాటిని వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సముదాయాన్ని, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.

కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆశ్వాఖుల్ల, ముక్తార్ సింగ్, సృజన, స్థానిక అధికారులు ఉన్నారు.