తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు

డిచ్‌పల్లి, మార్చ్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2025-26 విశ్లేషణ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్యయం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, బిజయ్‌ కుమార్‌ సాహూ ఎస్‌బిఐ డీజీఎం, కీలక ఉపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య. ఇ. పురుషోత్తం హాజరయ్యారు.

ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఈ పురుషోత్తం కీలకోపన్యాసం చేస్తూ తెలంగాణ అభివృద్ధి జరిగింది కానీ తెలంగాణ ప్రజలు అభివృద్ధి జరగలేదన్నారు.
సీఎం రేవంత్‌ రెడ్డి విద్యారంగం మీద మనస్సు కేంద్రీకరించినారని విద్యకు గతంలో ఎన్నడు లేని విధంగా రూ. 23,108 కోట్లు కేటాయించిందని ఇది గతం కంటే రూ. 1816 కోట్లు అధికమన్నారు. ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి అభివృద్ధి పద్ధతి కింద రూ. 500 కోట్లు కేటాయించడంతో ఉన్నత విద్యా రంగంలో బోధనా పరిశోధన వసతులు మెరుగయితాయని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి 58 ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను అన్ని వసతులతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ నడుంబిగించిందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎస్‌ బి ఐ, డీజీఎం బిజయ్‌ సాహు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపు ప్రవృత్తిని పెంచుకోవాలని, జీవిత బీమా మరియు డిపాజిట్లు పెంచుకోని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగం పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ కూర్పులో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల భాగస్వామ్యం ఉండే విధంగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.

సెమినార్‌లో చైర్మన్‌ బి ఓ ఎస్‌ డా.టి సంపత్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ రెడ్డి, డా.నాగరాజు పాత, డాక్టర్‌ ఎన్‌ స్వప్న, డా. సిహెచ్‌ శ్రీనివాస్‌, డా. దత్త హరి పాల్గొన్నారు.

అనంతరం ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ను వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టూ టా) డాక్టర్‌ అడిగే నాగరాజ్‌, డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌, డాక్టర్‌ మావురపు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్‌ బోయపాటి శిరీష, ఆచార్య కనకయ్యలు,
కాంట్రాక్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డా. దత్తహరి, డాక్టర్‌ రామలింగం, డాక్టర్‌ నరసయ్య, డాక్టర్‌ గంగా కిషన్‌, డాక్టర్‌ కిరణ్‌ రాథోడ్లు, ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ బాధ్యులు పుష్పగుచ్చం శాలువాతో సన్మానించారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »