ఆర్మూర్, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి మోతి బిందు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తామని ప్రముఖ సమాజ సేవకులు కొట్టూరు అశోక్ తెలిపారు. లెన్స్ విలువ రూ. 4000, ఆపరేషన్ విలువ రూ. 4000ల విలువతో కూడిన ఆపరేషన్లు ఉచితముగా చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
గత 30 సంవత్సరాలుగా సమాజ సేవలో భాగంగా కొన్ని వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని, అవసరం ఉన్నవారు 9440038389 మొబైల్ నెంబర్ కి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా వారైనా వివరములు తెలిపి ఉచితముగా ఆపరేషన్ చేయించుకోవచ్చు అని శ్రీమాన్ కొట్టూరు అశోక్ తెలిపారు.