కామారెడ్డి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలుగు నాడు విద్యార్థి సమైక్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒకటి గంటల వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడమే కాకుండా, విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహనను, భయాన్ని తొలగించడం కోసం నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం 100 మినిట్స్ 100 షార్ట్ కట్స్ అనే కార్యక్రమాన్ని గణిత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు.
ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా విధానానికి, ఎంసెట్,నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని మంచి ర్యాంకు సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రం పైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రస్తుతం రాసే వారి సంఖ్య లక్షల్లో ఉందని అందుబాటులో ఉన్న సీట్లు వేలల్లో మాత్రమే ఉన్నాయని, సరిjైున ప్రణాళికతో ముందుకు వెళితే విజయాన్ని సాధించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో రవళి, సంధ్య, ప్రసన్న, రజిని, వసంత, సంతోష, ప్రవళిక పాల్గొన్నారు.