నిజామాబాద్, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు.
విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర పదంలో 60 ఏళ్లు అనే పుస్తకం అందజేశారు. కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్ విభాగ్ కార్యదర్శి తమల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకుర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహకార దర్శి దాత్రిక రమేష్, విహెచ్పి నగర అధ్యక్షులు కోడిమల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నికేష్, బజరంగ్దళ్ నగర సహసంయోజక్ ఇందూరు సురేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.