బాన్సువాడ, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.