కామారెడ్డి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్ ఎంసెట్ నీట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎంసెట్, నీట్ పరీక్షలకు పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన ప్రణాళిక తో ముందుకు వెళ్తేనే మంచి కళాశాలల్లో సీటు పొందడం జరుగుతుందని విద్యార్థులకు సూచించారు. పరీక్ష నిర్వహించడానికి సహకరించిన ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్న వయసులోనే లక్షల రూపాయల ప్యాకేజీని ఇంజనీరింగ్ విద్యార్థులు పొందుతున్నారని దాని కోసం సరిjైున గైడెన్స్ తీసుకుని విద్యార్థులు జీవితాలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని అన్నారు. పరీక్ష అంటే భయాన్ని వదిలి అనుకూల వాతావరణం పెంపొందించుకుంటే ఉన్నత స్థాయి ర్యాంకులు సాధించవచ్చునని సూచించారు.
కార్యక్రమంలో ఎస్‌ఆర్కే ప్రిన్సిపాల్ దత్తాద్రి, కోఆర్డినేటర్ నవీన్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అంజల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, అధ్యాపకులు గోవర్దన్ రెడ్డి, శ్రీధర్, మహేష్, నరేష్, ధర్మపురి, శేఖర్, నవీన్, శ్రీ వాణీ పాల్గొన్నారు.