బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ అడ్డా… ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్‌ లేక తల్లడిల్లి పోతున్నారని, రాష్ట్రంలో ముస్లిం హిందువులు అన్నదమ్ముల వలె ఉన్నారని, దేశమంతా గంగ జమునల తెలంగాణ రాష్ట్రం ఉండేదన్నారు. గతంలో ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యా కొరకు 20 లక్షల రూపాయలు ఇచ్చేదని ప్రస్తుతం ఏ ఒక్క విద్యార్థి కూడా రూపాయి అందించలేదన్నారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని నిలదీయాలి…

బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరి ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన స్థానిక ఎమ్మెల్యేను ప్రజలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ పథకం కింద తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని ఎమ్మెల్యేను బాన్సువాడ ప్రజలు అడగాలన్నారు. ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు కానీ ముస్లింలకు బడ్జెట్‌లో ఎంత ప్రాధాన్యం కల్పించారో చెప్పాలన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 15 నెలల కాలంలో 40 సార్లు ఢల్లీి వెళ్లారని, అదిలాబాద్‌ జిల్లాలోని జైనూర్‌ లో మూడు నెలలు ఇంటర్నెట్‌ కూడా లేదని, ముస్లిం హిందువుల ఇల్లు కాలిపోయిన వాటిపై సమీక్ష జరిపే సమయం ప్రభుత్వానికి లేదన్నారు. వాటికోసం నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్న మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌, మోచి గణేష్‌లకు అండగా పార్టీ తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని పార్టీకి వారు చేస్తున్న సేవలను అభినందించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, అయేషా షకిల్‌,మాజీ గ్రంథాలయ చైర్మన్‌ సంపత్‌ గౌడ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌, నాయకులు మోచి గణేష్‌, ఎర్రవాటి సాయిబాబా, గౌస్‌, శివ సూరి, నర్సింలు గౌడ్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »