నిజామాబాద్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది ఈస్రాయేల్ ఎర్రబాపు దారుణ హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్యతోనైన న్యాయవాదులు రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.
ఎర్ర బాపు హత్య న్యాయవాద వృత్తి, న్యాయవ్యస్థల పట్ల చేసిన క్రూరమై నేర చర్యగా జగన్ పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందించే న్యాయవాదులు ఇలాంటి దాడులకు గురి కావడం ఆందోళన కలిగిస్తున్నదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య సంఘటనపై త్వరితగతిన నేర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎర్రబాపు కుటుంబానికి న్యాయవాద సమాజం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. హత్యకు పాల్పడిన హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షించే వరకు విశ్రమించబోమని జగన్ పేర్కొన్నారు.