బాన్సువాడ, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మేకలు గొర్రెలు, వారాంతపు సంత, రోజువారి సంతను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించగా రూ.67.77 లక్షలకు గుత్తేదారులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేకల గొర్రెల సంత రూ.46.26 లక్షలకు, రోజువారిసంత రూ.9.02 లక్షలకు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలకు కాంట్రాక్టర్లు దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. వేలంలో పెట్టించుకున్న గుత్తేదారులు నిబంధనలకు లోబడి డిపాజిట్ సొమ్మును అందజేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, సిబ్బంది, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.