బాన్సువాడ, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలోని వల్లేపు లక్ష్మి ,వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరగగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం నవవధువు వల్లెపు లక్ష్మి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని పట్టణ సీఐ మండల అశోక్ తెలిపారు.