బాన్సువాడ, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్టీసీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో బకాయిలను విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డివిజన్ కన్వీనర్ శంకర్ అన్నారు.
మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఆర్టీసీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పెన్షన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం అందించే ప్రజా సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారని, విశ్రాంత ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరారు.
పది సంవత్సరాల నుండి ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7500 డిఏను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల నాయకులు కౌసర్, మహమూద్, పండరి, మనోహర్,లక్ష్మారెడ్డి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.