నందిపేట్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయలను ఆర్మూర్ నియాజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి మంజూరు చేసారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ 15 లక్షలు, లక్కం పల్లి 10 లక్షలు, జొర్పూర్, సిద్ధాపూర్, రైతు ఫారం, మల్లారం, మాయాపూర్ గ్రామాలకు 5 లక్షల చొప్పున షాపూర్ 10 లక్షలు, వన్నెల్ 15 లక్షల చొప్పున మంజూరు చేసారు.
డొంకేశ్వర్ మండలంలో గంగా సముందర్, నికల్పూర్, నడికూడ గ్రామాలకు 5 లక్షలు, మారంపల్లి గ్రామానికి 10 లక్షల చొప్పున మంజూరు చేసారు. ఈ డబ్బులతో గ్రామాలలో సిమెంట్ రోడ్డు, మురికి కాలువలు నిర్మిస్తారని ఆర్మూర్ పంచాయతి రాజ్ డి ఈ కిషన్ తెలిపారు.