బాన్సువాడ, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ మంగళవారం తన స్వగ్రామమైన రాంపూర్ తండాలో వడ్లు ఆరబెడుతుండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది.
అందరితో కలివిడిగా ఉండే అంబర్ సింగ్ హఠాత్తుగా మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.