బాన్సువాడ, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న హైదరాబాదులో ఇజ్రాయిల్ అనే న్యాయవాదిని యాదగిరి అనే దుండగుడు హత్య చేయడం కిరాతకమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి అన్నారు.
మంగళవారం బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు లక్ష్మారెడ్డి, అమీద్, రామిరెడ్డి, మోహన్ రెడ్డి,మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.