నిజామాబాద్, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘రాజీవ్ యువ వికాసం’’ స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి / యువకులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఋణం అందించడం జరుగుతుందన్నారు.
వ్యవసాయేతర పథకాలకు 21-55 ఏళ్ళ వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ళ వయసు ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలు వారు అర్హులని బ్యాంక్ సమ్మతి తప్పనిసరిగా కావలని అన్నారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, విధ్యార్హతలు, బ్యాంక్ ఖాతా ప్రతులను తప్పనిసరిగా జత చేయవలెను.
ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక అంశాలలో ఎన్నుకొని స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవలెను. %ూదీవీవీూ% లో పూర్తి చేసిన ధరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొని దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, విధ్యార్హతలు, బ్యాంక్ ఖాతా ప్రతులను జత చేసి సంబంధిత మండల ఎంపిడిఓ లకు మరియు మున్సిపల్ కమీషనర్ల కార్యాలయములో అందజేయాలన్నారు. ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాలకు చందిన నిరుద్యోగ యువతి యువకులు ఏప్రిల్ 5వ తేదీలోగా వెబ్‌సైట్‌లో ధరఖాస్తు చేసుకోవాలని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.