కామారెడ్డి, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ముస్లిం మతస్తుల పవిత్ర మాసమైన రంజాన్ మాసమును పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నటువంటి ముస్లిం ఉద్యోగ సోదరీ సోదరీమణులకు ఇఫ్తార్ విందు కార్యక్రమము నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం సంతోషంగా అనిపించిందని ఈ కార్యక్రమానికి రావడానికి ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగులందరూ కుల మతాలకు అతీతంగా సోదర భావంతో వుండటం గొప్ప విషయం అని, టీఎన్జీవో ఆద్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన టిఎన్జీవోస్ సంఘానికి అభినందనలు తెలిపారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముస్లిం ఉద్యోగ సోదరీ సోదరీమణుల కొరకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం టీఎన్జీవోస్ జిల్లా శాఖ యొక్క ఆనవాయితీగా వస్తుందని. ఉద్యోగులందరం కులమత బేధాలు లేకుండా ఐకమత్యంతో సోదర భావంతో ఉండడం జరుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, సహాధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు యు సాయిలు, జె. శ్రావణ్ కుమార్, బి లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీలు గణేష్, ఖదీర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఈసీ మెంబర్ బి. దత్తాద్రి మరియు అశ్వక్, కామారెడ్డి అర్బన్ తాలూకా కార్యదర్శి సృజన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బట్టు రాజు, మక్బూల్, వారి కార్యవర్గ సభ్యులు, టిఏఎంఎస్‌ఏ రాష్ట్ర కోశాధికారి కె శివకుమార్, ముస్లిం మత ఉద్యోగులు పాల్గొన్నారు.