బాన్సువాడ, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు విద్యుత్ అంతరాయం కలగాకుండా ఉండేందుకు రాష్ట్ర సిఎండి ఆదేశాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని బాన్సువాడ డివిజనల్ అధికారి గంగాధర్ అన్నారు.
గురువారం బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ సంజీవరావు, ఏఈ సంతోష్ కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.