సమాజ పరివర్తన దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్‌ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి హైదరాబాదులో మీడియా ప్రతినిధులకు వివరించారు.

గత సంవత్సరంతో పోల్చితే 10 వేలకు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాయన్నారు. వీటితో పాటు 32,147 శాఖా మిలన్లు (వీక్లీ), 12,091 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయని, మొత్తంగా దైనందిన శాఖలు, మిలన్లు, మండలితో కలిపి 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణలో మొత్తం 1,839 స్థలాలలో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్‌ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయని వెల్లడిరచారు. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని, వీటిలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సంఫ్‌ుని గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించే లక్ష్యంతో ఐదారు గ్రామాలు ఒక ఉపమండలంగా దేశం మొత్తం మీద 58,900 పైచిలుకు గ్రామాలలో 30 వేలకు పైగా స్థలాలలో శాఖలు నడుస్తున్నాయన్నారు. ఇక తెలంగాణలో మొత్తం గ్రామీణ ఉపమండలాలు 1,602 కాగా, వీటిలోని 1,244 యూనిట్లలో అంటే సుమారు 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలలో శాఖలు నడుస్తున్నట్లు తెలిపారు.

అర్బన్‌ ఏరియాలలో ప్రతి 10 వేలమంది ఒక బస్తీగా (యూనిట్‌)సంఫ్‌ు కార్యం జరుగుతోందని, తెలంగాణలో 1504 నగర బస్తీలుండగా వీటిలో 1150 బస్తీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు నడుస్తున్నాయని, దీని ప్రకారం గ్రామాలలోను, నగరాలలోను ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సమాన ఆదరణ లభిస్తోందని శ్రీ రమేష్‌ చెప్పారు. బ్లాక్‌ స్థాయిలో 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణకు 9,500 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు. వీటితో పాటు నగరాలలోని స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘకార్య విస్తరణ ప్రయత్నం జరుగుతోందంటూ ఈ ఏడాది కొత్తగా 100 కొత్త సేవా బస్తీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ప్రారంభమై స్వయంసేవకుల ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు వివరించారు.

ఇక బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు, ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి శ్రీరమేష్‌ మీడియాకి తెలియజేశారు. ఇస్లామిక్‌ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, హిందువుల ఆస్తుల లూటీ, గృహదహనాలు తదితర పరిణామాలను, ఈ హింసాకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం తీసుకోవలసిన చర్యల గురించి ప్రస్తావించారు.

ఇక సంఫ్‌ు ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది విజయదశమితో ప్రారంభించి 2026వ సంవత్సరం విజయదశమి మధ్య ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాలు, సమాజ పరివర్తనా కార్యక్రమాలలో స్వయంసేవకుల భాగస్వామ్యానికి సంబంధించిన సంకల్ప పత్రంపై చర్చలు జరిగాయన్నారు.అదే సమయంలో పోర్చుగీసువారిపై పోరాడిన భారత స్వాతంత్య్ర పోరాట యోధురాలు రాణి అబ్బక్క 500వ జయంతిని సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబాళె గారు విడుదల చేసిన ప్రకటన, గత ఏడాది రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు.

గతేడాది తెలంగాణ ప్రాంతంలో జరిగిన విజయదశమి వేడుకల్లో సుమారు 50 వేలమందికి పైగా స్వయం సేవకులు పాల్గొని 161 స్థలాల్లో రూట్‌ మార్చ్‌ నిర్వహించారని, ఇందులో 28 వేలకు పైగా స్వయంసేవకులు సంఫ్‌ు యూనిఫాం వేసుకుని పాల్గొన్నారని తెలిపారు. ఇందులో ఎందరో కొత్తవారు ఉన్నారన్నారు. వచ్చే విజయదశమి రోజున ప్రతి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ గణవేష్‌ (యూనిఫాం)లో ఉత్సవం చేస్తుందని, ఇందులో భాగంగానే పథసంచలన్‌, శోభాయాత్రలు, ఘోష్‌ (సంగీత వాయిద్యాలతో) కూడా యూనిఫాంలో జరుగుతాయి తెలిపారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఫ్‌ు ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్‌-డిసెంబర్‌-జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

వచ్చే ఏడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌ నెలల్లో గ్రామగ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం, బస్తీలో అన్నింటా కలిపి శాఖల సంఖ్యను 4 వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.

వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం ఉంటూ వస్తోందని కాచం రమేష్‌ తెలియజేస్తూ ఈ సమైక్యతా కార్యం గురించి మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలలో సంఫ్‌ు విస్తరణ :

మొత్తం 58,981 గ్రామీణ మండలాల్లో 30,770 దైనందిన శాఖలు నడుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3,050 శాఖల మేరకు పెరుగుదల కనిపిస్తోంది.
ఆరెస్సెస్‌ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సంఘ విస్తరణ కోసం 2,453 మంది రెండేళ్ల కోసం విస్తారకులుగా వచ్చారు. ఈ ఏడాదితో సంఫ్‌ు 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇది విస్తరణ, ఏకీకరణ సమయంగా ఉంటుంది.

గత ఏడాది మొత్తం 4,415 ప్రారంభిక్‌ వర్గలు జరుగగా వీటి ద్వారా 2,22,962 మంది కొత్త స్వయంసేవకులుగా అయ్యారు. వీరిలో 1,63,000 మంది 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారు… 20,000 మంది 40 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. ఇక 2012లో ప్రారంభమైన వెబ్‌ సైట్‌ ద్వారా 12,73,453 మంది సంఫ్‌ుని సంప్రదించారు. వీరిలో 46 వేల మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు.

సేవావిభాగ్‌ నుంచి 89,706 సామాజిక కార్యక్రమాలు కొనసాగుతుండగా వీటిలో 40,920 విద్యకి సంబంధించిన కార్యక్రమాలు, 17,461 వైద్య సహాయక కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటు సేవా, స్వయం సహాయక కార్యక్రమాలు 10,779, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు 20,546 ఉన్నాయి. ఇంకా గోసంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతున్నది. మరోవైపు సామాజిక సమరసతపై కూడా స్వయంసేవకులు శ్రద్ధ వహిస్తున్నారు. తాగునీరు, ఆలయ ప్రవేశానికి సంబంధించిన సమస్యలతో పాటు సామాజిక దురాచారాలను తొలగించడానికి 1,084 ప్రాంతాల్లో పని నడుస్తోంది.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »