కామారెడ్డి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి అశోక్ (30) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆపరేషన్ నిమిత్తమై నిమ్స్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడిరది.
కాగా విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సుభాష్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తరఫున అభినందనలు తెలిపారు.