కామారెడ్డి, మార్చ్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దేశవ్యాప్తంగా ఉన్న గౌడులను ఒక తాటిపైకి తెచ్చి వారందరి నోట పాపన్న మహారాజ్ చరిత్రను ప్రచారం చేయించే బృహత్తరమైన బాధ్యత మనందరిదని తెలియజేయడం కోసమే ‘‘పాపన్న మహారాజ్ ఆత్మ బలిదాన దినోత్సవం’’కార్యక్రమామని జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. ఢల్లీిలో ఏప్రిల్ రెండవ తేదీన కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే కార్యక్రమానికి భారీ ఎత్తున గౌడ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మనం నిత్యజీవితంలో ఎన్నో ఖర్చులు పెట్టి బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, ఫంక్షన్లో నిర్వహించుకుంటాం. ఖర్చుకు భయపడం. అలాగే గౌడ జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన సర్దార్ పాపన్న మహారాజ్ నినాదం ఢల్లీిలో మారుమరోగించడానికి ఖర్చుకు వెనకాడకుండా దేశవ్యాప్తంగా ఉన్న గౌడులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.
చాలామంది పాపన్న గురించి మనకెందుకులే అని నిర్లక్ష్య వహించే వాళ్ళు కూడా ఉన్నారన్నారు. పాపన్న లేకుంటే గౌడ సమాజానికి గౌరవం లేదన్నారు. పాపన్న లేకుంటే భవిష్యత్తు లేదన్నారు.
పాపన్న మహారాజ్ వారసులమని చెప్పేందుకు గర్వపడాలన్నారు. పాపన్న రక్తం గౌడులలో అనువణువునా ఉప్పొంగాలనీ కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న గౌడులంతా జై పాపన్న మహారాజు అనే నినదిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌడ బిడ్డలు ఆనందంతో నృత్యం చెయ్యాలన్నరు. అటువంటి రోజు కోసం ఈరోజు నుండే మొదటి అడుగు ప్రారంభించలన్నారు. పాపన్న మహారాజ్ మరణించలేదని, దేశవ్యాప్తంగా ఉన్న గౌడుల గుండెల్లో సజీవంగా ఉండేలా చేసే ఈ ప్రయత్నానికి గౌడ బిడ్డలందరూ సహకరించి తండోపతండాలుగా కదిలి ఢల్లీికి రావాలని జై గౌడ్ ఉద్యమం తరుపున పిలుపునిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్ పాల్గొన్నారు.